మీ మీ BLOOD group , place ను ఇక్కడ comment చేయండి.
కృత్రిమ రక్తం
ఈ రోజుల్లో రక్త దానం చేస్తామని ముందుకొచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్త దానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒక పక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్క నుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్త దానం పుచ్చుకునే వారిలో ఎక్కవ భాగం వయ్సు మళ్ళిన వారే.కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి. దీనికి తోడు రవాణా ఇబ్బందులు, నిల్వ చెయ్యటంలో ఇబ్బందులు వల్ల కృత్రిమంగా రక్తం తయారు చెయ్యాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారు చేసిన రక్తం (artificial blood)ఈ దిగువ చూపిన లక్షణాలు కలిగి ఉండాలి.రక్తం ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన నిభందనలు:-
అది అవిషి (non-toxic) అయి ఉండాలి.
అందులో రోగకారక పదార్ధాలు ఉండకూడదు.
రవాణా చెయ్యటానికి అనుకూలంగా ఉండాలి.
గ్రహీత శరీరంలోకి ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన (immune reaction) రాకూడదు.
ఏ జాతి రక్తంతో అయినా కలసిపోగలగాలి.
అవసరం తీరేవరకూ (శరీరం తన సొంత రక్తాన్ని తయారు చేసుకునే వరకు) పాడవకుండా పని చెయ్యాలి.
అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
అలమారు లో చాల కాలం నిల్వ ఉంచినా పాడవకూడదు. (దీనినే అలమారు ఆయుర్దాయం లేదా shelf life అంటారు.)
ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్ధం దొరకలేదు.కనుక అర్ధం చేసుకోండి మిత్రులారా ... మనం సాధ్యమైన౦త వరకు అపోహలని దూరం చేసుకోండి. రక్తదానానికి చేతులు కలపండి.మేమున్నాం అంటూ ముందుకు రండి.. రక్తదానం లో పాలుపంచుకోండి. నలుగురికీ సాయపడండి..మీరు చేయాల్సిందల్లా మీ , మీ కుటుంబ సభ్యుల వివరాలను పంచుకోవటంతో పాటు స్నేహితులకు , సన్నిహితులకు ఈ సమాచారాన్ని తెలియపరచండి.
Fill the Blood Donation Form :
Click here to Register
STASS Foundation







0 comments:
Post a Comment